హైదరాబాద్, జూన్ 24(నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ జాయింట్ సెక్రటరీ(టెక్నికల్)గా డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్‌కు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. మంగళవారం ఉత్తర్వులు జారీ చే సింది. జాయింట్ సెక్రటరీ భీమ్ ప్రసాద్ ఆరునెలల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. నాటి నుంచి పోస్టు ఖాళీగా ఉండగా, ఆయన స్థానంలో ప్రస్తుతం శ్రీనివాస్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. శ్రీనివాస్ ప్రస్తుతం ఈఎన్సీ జనరల్ వద్ద డిప్యూటీ ఈఎన్సీగా కొనసాగుతున్నారు.
ఈ నెలాఖరున పదవీ విరమణ పొందనున్న ఇంజినీర్ల స్థానంలో పలువురికి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. కరీంనగర్ ఈఎన్సీ శంకర్ విరమణ పొందనుండగా, ఆయన స్థానంలో నిజామాబాద్ సీఈ మధుసూదన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. అలాగే మరో 13మంది విరమణ పొందనుండగా వారి బాధ్యతలను ఇతరులకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.