హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ): దేశంలోనే ప్రముఖ ఆర్ అండ్ డీ సంస్థల్లో ఒకటైన హెక్సాగాన్ ఇండియాతో శ్రీనిధి విద్యాసంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఆధునాతన పరిశోధనల కోసం విద్యాసంస్థలో ఏర్పాటు చేసిన ల్యాబొరేటరీని ప్రారంభించారు.
తాజా ఒప్పందం ద్వారా పరిశోధనలను ప్రేరేపించేందుకు అవకాశం ఏర్పడుతుందని హెక్సాగాన్ ప్రతినిధి శేఖర్ చెప్పారు. విద్యార్థి దశ నుంచే పారిశ్రామిక లక్షణాలను పెంపొందించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని శ్రీనిధి టెక్నాలజీ సీఈవో అభిజిత్ రావు పేర్కొన్నారు.