హైదరాబాద్, జనవరి 15(నమస్తే తెలంగాణ): ‘కాళేశ్వరం-మంథని-రామగిరి’ని ఆథ్యాత్మిక, వారసత్వ పర్యాటక సర్క్యూట్‌గా గుర్తించి అభివృద్ధి చేయాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన శ్రీధర్‌బాబు మంథని నియోజకవర్గంలోని కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం, రామగిరికోటను టూరిజం హబ్‌గా అభివృద్ధి చేసేందుకు చొరవ చూపాలని వినతిపత్రం అందజేశారు.
హైదరాబాద్, జనవరి 15(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న 4 పథకాలకు లబ్ధిదారుల జాబితా ఈ నెల 21వ తేదీ నుంచి నిర్వహించే గ్రామసభల్లో ఆమోదం పొందాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ఈ నెల 26న ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో అమలు కార్యాచరణపై బుధవారం జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ సమీక్షించారు. లబ్ధిదారుల ఎంపికకు క్షేత్రస్థాయిలో తనిఖీల అనంతరం వివరాలను గ్రామసభల్లో ప్రదర్శించి ఆమోదం పొందాలని సీఎస్ సూచించారు.