భద్రాచలంలో వైభవంగా సీతారాముల కల్యాణం
Seeta Rama Kalyanam | భద్రాచల క్షేత్రంలో రామయ్య కల్యాణ వేడుక కన్నుల పండువగా జరిగింది. అభిజిత్ ముహూర్తాన సీతారాముల కల్యాణం కమనీయంగా సాగింది. భక్త శ్రీరామదాసు చేయించిన ఆభరణాలను అలంకరించుకుని రామయ్య పెండ్లికొడుకుగా, సీతమ్మ పెండ్లికుమార్తెగా దర్శనమిచ్చారు
భద్రాచలం: భద్రాచల క్షేత్రంలో రామయ్య కల్యాణ వేడుక కన్నుల పండువగా జరిగింది. అభిజిత్ ముహూర్తాన సీతారాముల కల్యాణం కమనీయంగా సాగింది. భక్త శ్రీరామదాసు చేయించిన ఆభరణాలను అలంకరించుకుని రామయ్య పెండ్లికొడుకుగా, సీతమ్మ పెండ్లికుమార్తెగా దర్శనమిచ్చారు. సరిగ్గా పన్నెండు గంటలకు జిలకర్ర, బెల్లం పెట్టారు. అనంతరం మాంగళ్యధారణ జరిగింది. రాములవారికి కల్యాణానికి ప్రభుత్వం తరఫున మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ తరఫున వైవీ సుబ్బారెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

రెండేండ్ల తర్వాత స్వామివారి కల్యాణానికి భక్తులను అనుమతించడంతో.. మిథిలా స్టేడియం కిక్కిరిసిపోయింది. ఆలయ వీధులు భక్తజనసందోహంగా మారాయి. శ్రీరామ నామస్మరణతో భద్రగిరి మారుమోగింది. కొవిడ్ కారణంగా రెండేళ్ల పాటు శ్రీరామనవమి ఉత్సవాలను ఆంతరంగికంగానే నిర్వహించారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

