హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన ఎస్సీ అభ్యర్థులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఎస్సీ కార్పొరేషన్ అందించే ఉచిత శిక్షణలో ప్రవేశాలకు ఈ నెల 27న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్టు తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ నర్సింగ్ సంస్థ బుధవారం తెలిపింది. ఐఈఎల్టీఎస్, ఓఈటీ, స్పోకెన్ ఇంగ్లిష్, ఫారిన్ లాంగ్వేజెస్పై ఆరునెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని, భోజన వసతిని కల్పిస్తామని పేర్కొన్నది. 20 మంది అభ్యర్థులకు అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.వివరాలకు 98485 81100, 99491 87426 సంప్రదించాలని సూచించింది.