రెండ్రోజుల్లో 45 వేల దరఖాస్తులు
- ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సిబ్బందికి సాయం ప్రక్రియలో వేగం

హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సిబ్బందికి నెలకు రూ.2 వేల నగదు, 25 కిలోల బియ్యం పంపిణీ కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నది. శనివారం 2,562 దరఖాస్తులు రాగా.. ఆదివారం వీటి సంఖ్య 45,025కు చేరుకున్నది. 10 వేల వరకు దరఖాస్తులను విద్యాశాఖ అధికారులు మండలస్థాయిలో పరిశీలించారు. సవ్యంగా ఉన్నవాటిని ఆమోదం కోసం జిల్లాస్థాయికి పంపిస్తున్నారు. ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశమిచ్చారు. ఆన్లైన్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులను మండలస్థాయి పరిశీలనలో భాగంగా స్కూల్ కాంప్లెక్స్లవారీగా చేపడుతున్నారు. వచ్చిన దరఖాస్తులు, సమర్పించిన ఆధారాలను ఈ బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. సెలవురోజుల్లోనూ బృందాలు పనిచేస్తున్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో 115 పాఠశాలల్లో 1,260 దరఖాస్తులు అప్లోడ్ చేయగా.. 54 బృందాలు 500 వరకు దరఖాస్తులను పరిశీలించాయి. మంచిర్యాల జిల్లాలో 36 బృందాలను ఏర్పాటుచేయగా.. 50 పాఠశాలల నుంచి వచ్చిన 150 వరకు దరఖాస్తులను పరిశీలన పూర్తిచేశాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | రిమాండ్ రిజెక్ట్స్..! బలంగా వాదనలు వినిపిస్తున్న బీఆర్ఎస్ లీగల్ టీమ్
పండుగ పూట..జర పైలం!
Palamuru Migration | నడిగడ్డ మళ్లీ వలసబాట..! సీఎం సొంత జిల్లాలో దారుణ పరిస్థితులు
KTR | బహిరంగ దోపిడీ.. కాంగ్రెస్ దోపిడీకి రాహులే కొత్త పదం చెప్పాలె
Mannе Krishank | మూడేండ్లకే ఆమె బిలియనీర్స్.. బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

