హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సీఆర్ఐఎఫ్ రోడ్లు, సేతుబంధన్, రైలు ఓవర్ బ్రిడ్జ్ పనుల్లో వేగం పెంచాలని ఉన్నతాధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. శనివారం సచివాలయంలో రోడ్లు, భవనాల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా పనుల్లో మరింత పురోగతి సాధించాల న్నారు. మిర్యాలగూడ, నందిపహాడ్ బ్రిడ్జి పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. డిసెంబర్ నాటికి సచివాలయంలో సోలార్ కార్ పారింగ్ పను లు పూర్తి చేయాలని సూచించారు.
హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం కొనసాగుతున్న జనగణన ప్రక్రియతోపాటు కులగణన సైతం నిర్వహించాలని తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ నిరంజన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. కేంద్ర క్యాబినెట్ రాజకీయ వ్యవహారాల ఉపసంఘం నిర్ణయాన్ని అమలు చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీలతో సమానంగా బీసీల జనగణననూ తప్పనిసరి చేయాలని కోరారు.