ఓటర్ల జాబితాలో నకిలీలను ఏరాల్సిందే
రాష్ట్రంలో గురువారం నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.
- రెండు రాష్ట్రాల్లో ఓటు హకు ఉన్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలి
- జూబ్లీహిల్స్ ఎన్నికల్లో దొంగ ఓట్లు ఉన్నాయన్నా చర్యలు తీసుకోలేదు
- రేపటి నుంచి ప్రారంభమయ్యే ‘సర్’ ప్రక్రియపై బీఆర్ఎస్ 15 సూచనలు
- సీఈవోకు వినతిపత్రం అందజేసిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందం
హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గురువారం నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఓటర్ల జాబితాలో నకిలీలు ఏరాల్సిందేనని స్పష్టంచేసింది. రెండు రాష్ట్రాల్లో ఓటు హకు ఉన్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించింది. హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాద్ వంటి పట్టణ ప్రాంతాలకు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, బీహార్ తదితర రాష్ట్రాల నుంచి లక్షల మంది ఉపాధి కోసం వలస వచ్చారని, వారిలో కొందరు తమ సొంత రాష్ట్రాలతోపాటు ఇకడ కూడా ఓటు హకు కలిగి ఉన్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా స్వచ్ఛతను కాపాడటానికి 15 కీలక సూచనలతో కూడిన ప్రతిపాదనలను ఎన్నికల సంఘం ముందు ఉంచింది.
ఈ మేరకు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం బీఆర్కే భవన్‌లోని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డికి మంగళవారం వినతిపత్రాన్ని సమర్పించింది. పార్టీ ప్రతినిధులు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పార్టీ ప్రధాకార్యదర్శులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సోమా భరత్‌కుమార్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్, పార్టీ నేత రవినాయక్లతో కూడిన బృందం ఈ వినతిపత్రాన్ని అందజేసింది. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో దొంగ ఓట్లు ఉన్నాయని తాము ఆధారాలతోసహా సీఈవో దృష్టికి తీసుకొచ్చినా అయిన కనీసం చర్యలు తీసుకోలేదని ఆక్షేపించింది. ఒక వ్యక్తికి ఒకచోట మాత్రమే ఓటు ఉండాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. అర్హులైన ఓటర్ల హకులను కాపాడుతూనే, అనర్హులను, నకిలీ ఓట్లను తొలగించినప్పుడే ఈ ప్రక్రియ విజయవంతమవుతుందని, ఈ పవిత్రమైన ప్రక్రియకు ఎన్నికల సంఘానికి తమ పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నది.
బీఆర్ఎస్ అందజేసిన 15 కీలక సూచనలు
- ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే ‘సర్’ పక్రియలో కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన అన్ని నిబంధనలను క్షేత్రస్థాయిలో కఠినంగా అమలు చేయాలి.
- సవరణ ప్రక్రియను ప్రతి దశలోనూ ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. పారదర్శకతను పెంపొందించాలి.
- ఒకే నియోజకవర్గంలో, వేర్వేరు నియోజకవర్గాల్లో, జిల్లాల్లో లేదా ఇతర రాష్ట్రాల్లో ఉన్న నకిలీ, డూప్లికేట్ ఓటర్ల నమోదును గుర్తించి వాటిని తొలగించాలి.
- ఇతర రాష్ట్రాల ఓటర్ల జాబితాలో పేర్లు ఉండి, ఇకడ కూడా ఓటు హకు పొందిన వలసదారుల వివరాలపై ప్రత్యేకంగా వెరిఫికేషన్ చేపట్టాలి.
- బహుళ ఓటు నమోదును అరికట్టడానికి పొరుగు రాష్ట్రాల ఎన్నికల అధికారులతో సమర్థవంతమైన సమన్వయం, డాటా షేరింగ్ వ్యవస్థను ఏర్పాటుచేయాలి.
- బూత్ లెవల్ అధికారులు(బీఎల్వో), ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారుల (ఈఆర్వోలు) ద్వారా క్షేత్రస్థాయిలో లోతైన పరిశీలన జరిపించాలి.
- మరణించిన వారి పేర్లు, నకిలీ చిరునామాలు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను సరైన పరిశీలన తర్వాత జాబితా నుంచి తొలగించాలి.
- ముందస్తు నోటీసు ఇవ్వకుండా, విచారణ జరుపకుండా ఏ ఒక అసలైన ఓటరు పేరును జాబితా నుంచి ఏకపక్షంగా తొలగించకూడదు.
- ఓటర్ల చేర్పులు, తొలగింపులు, సవరణలకు సంబంధించిన పూర్తి వివరాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉంచాలి.
- ఓటర్ల జాబితాలోని అక్రమాలపై రాజకీయ పార్టీలు తమ అభ్యంతరాలు, ఆధారాలను సమర్పించడానికి తగిన అవకాశం కల్పించాలి.
- ఓటర్ల జాబితాకు సంబంధించిన ఫిర్యాదులను త్వరితగతిన పరిషరించేందుకు ఒక ప్రత్యేక గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఏర్పాటు చేయాలి.
- నకిలీ, అనుమానాస్పద ఓటర్ల నమోదును కనిపెట్టేందుకు అందుబాటులో ఉ న్న అత్యాధునిక సాంకేతిక, డిజిటల్ వెరిఫికేషన్ సాధనాలను ఉపయోగించాలి.
- ప్రత్యేక సవరణ పురోగతిపై కాలానుగుణంగా సమీక్షలు నిర్వహిస్తూ, క్షేత్రస్థాయి అధికారులను జవాబుదారీగా చేయాలి.
- ఎన్నికల సంఘం ఆదేశాలు, మార్గదర్శకాల అమలుపై నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
- ప్రక్రియ సమగ్రత, పారదర్శకత, విశ్వసనీయతను కాపాడేలా కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి.
కొందరికి నాలుగైదు చోట్లు ఓట్లు: దాసోజు
తమ పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశాల మేరకు సీఈవో సుదర్శన్‌రెడ్డిని కలిసి ‘సర్’ ప్రక్రియపై వినతిపత్రం అందజేసినట్టు బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ ప్రక్రియలో లోటుపాట్లు, సమస్యలను సీఈవో దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. మంగళవారం సీఈవోకు వినతిపత్రం అందించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ గ్లోబల్ సిటీలో చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి ఇకడ నివాసం ఉంటున్నారని, ఇందులో కొందరికి నాలుగు అయిదు చోట్ల ఓట్లు ఉన్నాయని, అది చట్ట వ్యతిరేకమని తెలిపారు. అలాంటి ఓట్లు తొలగించాలని కోరామని చెప్పారు. అభ్యంతరాలు ఉంటే లేఖ రాస్తే కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తామని సీఈవో చెప్పారని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chakali Ilamma | మెదక్‌లో చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం.. రజక సంఘం ఆందోళన
Actress Laya | బాలకృష్ణ కాలు తొక్కిన లయ.. ఆయన మాటలకు ఏడుపొచ్చేసింది అంటూ కామెంట్
OTT Movies | ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. దసరాకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

