హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికపై జిల్లాలవారీగా సమీక్షించి కార్యాచరణ రూపకల్పన కోసం ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. మెట్రోపాలిటన్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్‌రంజన్‌ను హైదరాబాద్‌కు, ఆర్అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్‌ను మేడ్చల్-మల్కాజిగిరి, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇంప్లాంటేషన్ ఆఫ్ ఫ్లాగ్షిప్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్‌ను రంగారెడ్డి, స్పెషల్ సీఎస్ వైఏటీ అండ్ సీ వాణీప్రసాద్‌ను మెదక్, స్పెషల్ సీఎస్ జీఏడీ బీఎండీ ఎక్కాను యాదాద్రి భువనగిరి, స్పెషల్ సీఎస్ విద్యుత్ శాఖ నవీన్ మిట్టల్‌ను వికారాబాద్, స్పెషల్ సీఎస్ పీఆర్అండ్ఆర్డీ దానకిశోర్‌ను మహబూబ్‌నగర్, స్పెషల్ సీఎస్ ఈఎఫ్ఎస్అండ్ టీ అహ్మద్ నదీమ్‌ను సిద్దిపేట, స్పెషల్ సీఎస్ రెవెన్యూ టెక్స్టైల్ అండ్ హ్యాండీ క్రాఫ్ట్స్ శైలజారామయ్యర్‌ను రాజన్న సిరిసిల్ల, స్పెషల్ సీఎస్ మైన్స్ అండ్ జియాలజీ ఎన్ శ్రీధర్‌ను జయశంకర్ భూపాలపల్లికి నియమించారు.