దోస్త్ మేరా దోస్త్..
స్నేహం.. అద్భుతమైనది, అపురూపమైనది, అమూల్యమైనది. అన్ని బంధాల్లోనూ గొప్పది! అలాంటి స్నేహం.. దాదాపు ప్రతిఒక్కరి జీవితంలోనూ ఉంటుంది. అలాగని, జీవితంలో తారసపడేవాళ్లంతా స్నేహితులు కాలేరు. కొందరు.. తొలి పరిచయంతోనే ప్రాణస్నేహితులుగా మారిపోతారు.
స్నేహం.. అద్భుతమైనది, అపురూపమైనది, అమూల్యమైనది. అన్ని బంధాల్లోనూ గొప్పది! అలాంటి స్నేహం.. దాదాపు ప్రతిఒక్కరి జీవితంలోనూ ఉంటుంది. అలాగని, జీవితంలో తారసపడేవాళ్లంతా స్నేహితులు కాలేరు. కొందరు.. తొలి పరిచయంతోనే ప్రాణస్నేహితులుగా మారిపోతారు. ఇంకొందరు.. పరిచయస్తులతోనూ మాట్లాడటానికి మొహమాటపడుతుంటారు. అయితే, ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం చిగురించాలంటే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలని సైకాలజిస్టులు అంటున్నారు. అవి కుదిరితేనే.. ఆ స్నేహబంధం కలకాలం నిలుస్తుందని చెబుతున్నారు.
చెప్పేది వినండి..
ఎదుటివారితో నిజాయతీగా వ్యవహరించాలి. వారు చెప్పేది శ్రద్ధగా వినాలి. వారు చెప్పే విషయాల పట్ల మీరు ఆసక్తి చూపిస్తున్నారన్న నమ్మకం కుదిరితే మీపట్ల ఆకర్షితులవుతారు. అంతేకాదు వారి అభిప్రాయాలను గౌరవిస్తున్నారన్న భావన కలగజేయడం ప్రధానం. అలాంటి వ్యక్తులను స్నేహితులుగా అంగీకరిస్తారు.
దయతో ఉండండి..
ఎవరిమీదైనా దయ చూపించినప్పుడు.. వారు మీ గురించి సానుకూలంగా స్పందిస్తారు. కాబట్టి, ఎదుటివారి భావోద్వేగాలను అర్థం చేసుకోవాలి. ఆపదలో, కష్టాల్లో ఉన్నవారిపట్ల దయతో ఉండాలి. ఆ ప్రవర్తన.. వారు మిమ్మల్ని ఇష్టపడేలా చేస్తుంది. సహానుభూతితో చేసే చిన్నచిన్న పనులు కూడా.. ఇతరులపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. వారిని మీ స్నేహితులుగా మార్చేస్తాయి.
నవ్వుతో చేరువ..
ఒక చిరునవ్వు.. చుట్టూ ఉన్నవారిని మీకు చేరువ చేస్తుంది. వారి దృష్టిని ఆకర్షిస్తుంది. కాబట్టి, కొత్త వ్యక్తులైనా చూడగానే చిరుదరహాసంతో పలకరించండి. దాంతో, వాళ్లూ మీతో మాట్లాడడానికి ఆసక్తి చూపుతారు. మీ శరీర భాషకూడా.. ఎదుటివారిని మీకు దగ్గర చేస్తుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారికి ఎక్కువమంది స్నేహితులు అవుతారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి కూడా.
ఆసక్తులు కలిస్తే..
సాధారణంగా ఒకే అభిరుచి కలిగిన వ్యక్తులు.. మంచి స్నేహితులుగా మారుతారు. పెంపుడు జంతువులు, ప్రకృతి, సినిమాలు, ఆటలు, పాటలు.. ఇలా ఏ విషయంలోనైనా ఇద్దరి అభిప్రాయాలు కలిస్తే.. వారి మధ్య స్నేహం బలపడుతుంది. ఆయా విషయాలపై కలిసి చర్చించుకోవడం వల్ల ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ పెరుగుతుంది. ఎక్కువ సమయం కలిసి గడపడం వల్ల మంచి స్నేహితులయ్యే అవకాశం ఉంటుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

