హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): కొండగట్టు హనుమాన్ ఆలయంలో జూన్ 1న జరిగే హనుమాన్ జయంతి ఉత్సవాల పర్యవేక్షణకు దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్లు రామకృష్ణ, వినోద్రెడ్డిని ప్రత్యేక అధికారులుగా నియమించినట్టు దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. బుధవారం ఆయన సంబంధిత అధికారులతో సమీక్షించారు. జాతరకు హాజరయ్యే భక్తులకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు.