హైదరాబాద్, మే2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించిన మార్చ్ఫాస్ట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మహాత్మ జ్యోతిబాఫూలే గురుకుల విద్యార్థులను స్పెష ల్ జ్యూరీ అవార్డు వరించింది. సొసైటీ కార్యదర్శి బడుగు సైదులుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అవార్డును అందజేశారు. నాగార్జునసాగర్, కొలిముంతలపాడు, కమలాపూర్ మ హాత్మ జ్యోతిబాఫూలే గురుకులాలకు చెందిన 70మంది విద్యార్థులు మార్చ్ఫాస్ట్లో పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో మార్చ్ఫాస్ట్ బృందానికి కెప్టెన్‌గా వ్యవహ రించిన చందును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు. స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్న విద్యార్థులను బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం అభినందించారు. వేడుకల్లో ఎంజేపీ సొసైటీ ఫిజికల్ డైరెక్టర్లు శ్రీనివాస్‌రావు, భాసర్, రామయ్య, సొసైటీ జాయింట్ సెక్రటరీ తిరుపతి, పర్యవేక్షకుడు కేశవులు పాల్గొన్నారు.