టూరిజం డే వెబినార్‌లో టీఎస్‌టీడీసీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా చెప్పారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటక రంగం సమగ్రాభివృద్ధిపై శనివారం స్కల్ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ (ఐఐహెచ్ఎం) హైదరాబాద్ సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ వెబినార్‌లో ఆయన మాట్లాడారు. పర్యాటక ప్రదేశాల్లో 44 హరిత హోటళ్లు, రెండు రెస్టారెంట్లు, 29 బస్సులు, 102 వాటర్ బోట్లను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ నుంచి పర్యాటక ప్రదేశాలకు ప్రత్యేక ప్యాకేజీలతో బస్సులు నడుపుతున్నట్టు వివరించారు.