హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ)/బాన్సువాడ: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆజ్మీర్ దర్గాలో మంగళవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
రాజస్థాన్‌లో ఈ నెల 13 వరకు నిర్వహించే ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ 83వ కాన్ఫరెన్స్‌కు వెళ్లడానికి ముందు మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శి వీ నర్సింహాచార్యులు అక్కడి అజ్మీర్ షరీఫ్ దర్గాను సందర్శించి చాదర్, పువ్వులను సమర్పించారు. వీరి వెంట నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాసర్‌రెడ్డి, నల్లగొండ జడ్పీ ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి తదితరులు ఉన్నారు.