ములుగురూరల్, మార్చి19: లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని ములుగు ఎస్పీ డాక్టర్ శబరీశ్ తెలిపారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం నుంచి మంజూరైన రివార్డు డీడీలను అందజేసి మాట్లాడారు.
సరెండర్ రిహాబిలిటేషన్లో భాగంగా ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు పార్టీ నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యురాలు అలువ స్వర్ణకు రూ. 4లక్షలు, సెంట్రల్ కమిటీ సభ్యుడు దివంగత కటకం సుదర్శన్ భార్య డీవీసీఎం సభ్యురాలు పులుసం పద్మకు రూ. 5లక్షల డీడీలను అందించినట్టు తెలిపారు.