తాటి, ఈత వనాలకు ‘ఉపాధి’
స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాతే తెలంగాణలో గౌడ కులస్థుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమయ్యాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు.
- స్వరాష్ట్రంలోనే గౌడన్నల సమస్యలకు పరిష్కారం
- గీత పనివారల సంఘం మహా సభలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్
మేడ్చల్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాతే తెలంగాణలో గౌడ కులస్థుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమయ్యాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో తాటి, ఈత వనాల పెంపకానికి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించుకోవడంతోపాటు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కల్లు గీత సహకార సంఘాలకు సూచించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడలో శనివారం జరిగిన రాష్ట్ర గీత పనివారల సంఘం ద్వితీయ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంఘం అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పు డు హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని కల్లు అమ్మకాలను నిషేధించారని, తెలంగాణ ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ వాటిని పునరుద్ధరించారని గుర్తుచేశారు.
గీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వడంతోపాటు కల్లు గీత సమయంలో ప్రమాదవశాత్తూ చెట్లపై నుంచి పడి మరణించినవారి కుటుంబాలకు పరిహారం చెల్లిస్తున్నదని తెలిపారు. గీత కార్మికులకు ఇంకా ఏమైనా సమస్యలుంటే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణలోని గీత కార్మికులకు ఆరాధ్యనీయుడైన స్వాతంత్య్ర సమరయోధుడు బొమ్మగాని ధర్మభిక్షం కష్టాల్లో ఉన్న పేద వర్గాలకు దిక్సూచి లాంటివారని కొనియాడారు. గీత కార్మికులతోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ధర్మభిక్షం చేసిన పోరాటాలను స్వయంగా చూశానని, ఆయన ప్రభావం తనపై ఎంతో ఉన్నదని వినోద్‌కుమార్ తెలిపారు.
గీతా కార్మికుల సమస్యలపై పోరాడిన తొలి సంఘం గీత పనివారల సంఘమేనని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సంఘం చేసిన పోరాటల వల్లనే గీత కార్మికులు అనేక హక్కులను, పథకాలను సాధించుకోగలిగారని వివరించారు. ఈ మహాసభలో ఆహ్వాన సంఘం చీఫ్ పల్లా వెంకట్‌రెడ్డితోపాటు వృత్తి సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు, రాష్ట్ర అధ్యక్షుడు సదానంద్‌గౌడ్, బొమ్మగాని ప్రభాకర్‌గౌడ్, సీహెచ్ భూపాల్‌గౌడ్, ప్రతినిధుల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు పండ్ల రాములు, నాయకులు బీ నాగభూషణం, పబ్బు వీరాస్వామి, శ్రీరాములు మారగోని, ప్రవీణ్, శ్రీనివాస్, మంద పవన్, రాష్ట్ర బీసీ నాయకుడు ఆర్ పాండురంగాచారి, మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్, పల్లె నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

