హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ ముందుండాల ని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమం ప్రారంభమై ఐదేండ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం గాంధీ మెడికల్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.
మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులు, ప్రజల్లో అవగాహన కలిగేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.