95% మంది సోషల్ మీడియాలోనే విహారం
56.6% మందికి ఫేక్, రియల్ న్యూస్ తెలియదు
ఎసెన్సియల్ డిజిటల్ హెడ్‌లైన్స్ నివేదికలో వెల్లడి
హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): వాట్సాప్‌లో గుడ్‌మార్నింగ్‌తో మొదలవుతున్న రోజు.. వాట్సాప్‌లో గుడ్‌నైట్ మెసేజ్‌తోనే ముగుస్తున్నది. ఇంటర్నెట్ ప్రపంచంలో, స్మార్ట్‌ఫోన్ యుగంలో మనుషుల జీవితం సోషల్ మీడియా బందీగా మారుతున్నది. ఇంటర్నెట్ వినియోగంపై ఎసెన్షియల్ డిజిటల్ హెడ్ లైన్స్ తాజా నివేదిక ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నది. ఇంటర్నెట్ను 95 శాతం మంది సోషల్ మీడియా నెట్‌వర్క్‌ల కోసమే వాడుతున్నట్టు సర్వే పేర్కొన్నది.
వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఆన్లైన్ వేదిక ఏదైనా సరే వాటిల్లో వస్తున్న వార్తలు, ఇతర విషయాల్లో ఏవి నిజమో, ఏవి అబద్ధమో తెలియకుండానే ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇంటర్నెట్లో వాడుతున్న వారిలో 56.6 శాతం మంది ఈ విషయాన్ని అంగీకరించినట్టు సర్వే తెలిపింది. దేశంలో సైబర్ నేరాల నియంత్రణపై ఇటీవల ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో జాతీయస్థాయి సదస్సులో సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ సింఘనవర్ తన ప్రెజేంటేషన్లోనూ ఇవే అంశాలను వివరించారు. అందులో పేర్కొన్న ప్రధాన అంశాలివీ..