సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 22, 2020 , 08:43:42

రైల్వేస్టేషన్‌లో ‘సామాజిక దూరం’

రైల్వేస్టేషన్‌లో ‘సామాజిక దూరం’

సికింద్రాబాద్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు జనం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌లో టిక్కెట్‌ కౌంటర్‌ వద్ద సామాజిక దూరాన్ని పాటించాలని తెలియజేస్తూ మీటర్‌ గ్యాప్‌ దూరం ఉండే విధంగా ప్లాస్టర్లతో మార్కింగ్‌లను రైల్వేశాఖ స్థానిక అధికారులు ఏర్పాటు చేశారు. టిక్కెట్‌ కొనుగోలు చేసేందుకు క్యూలో నిలబడేందుకు వచ్చే ప్రయాణికులు లైన్‌మీద నిలబడాల్సిందిగా కోరుతూ కౌంటర్‌లో అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని, టిక్కెట్‌ లైన్‌లో ఉన్నప్పుడు మనిషికి మనిషికి మధ్య కనీసం మీటర్‌ దూరం ఉండేలా అందరూ క్యూలైన్‌ పాటించాలని కోరుతున్నారు. రైల్వే స్టేషన్‌ ఎనౌన్స్‌మెంట్‌లో కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నారు. 


logo