హైదరాబాద్, మే10 (నమస్తే తెలంగాణ): బీసీ గురుకులాల్లోని 6,7,8 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి బుధవారం నిర్వహించిన ప్రవేశపరీక్ష సజావుగా ముగిసినట్టు బీసీ గురుకులాల కార్యదర్శి మల్లయ్యభట్టు తెలిపారు.
పరీక్షకు 69,147 దరఖాస్తులు రాగా, 60,949 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 295 కేంద్రాల్లో పరీక్ష జరిగినట్టు వెల్లడించారు.