కరీంనగర్ : కరీంనగర్ పట్టణంలో వివిధ కూడళ్ల సుందరీకరణ పనులు వేగంగా, స్మార్ట్‌గా కొనసాగుతున్నాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ మానేరు డ్యామ్ కట్టపై ముఖ ద్వారం సుందరీకరణ కోసం ఐలాండ్ స్థలాన్ని నగర మేయర్ వై సునీల్ రావు తో కలిసి మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ..తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న నగరాలలో హైదరాబాద్ తర్వాత కరీంనగర్ ముందంజలో ఉందని మంత్రి పేర్కొన్నారు.
అందుకు నిదర్శనం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్చేతుల మీదుగా సుమారు వెయ్యి కోట్ల రూపాయల పనులను ప్రారంభించామని గుర్తు చేశారు. కరీంనగర్ కు ముఖద్వారమైన లోయర్ మానేర్ డ్యాం కట్ట పైన అందమైన ఐలాండ్ ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.