హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో ఆరుగురు అధికారులు బదిలీ అయ్యారు. నారాయణపేట ఇన్చార్జ్ డిపో మేనేజర్‌గా ఉన్న ఆర్ రామ్మోహన్‌కు నర్సాపూర్ ఇన్చార్జ్ డిపో మేనేజర్ పోస్టింగ్ ఇచ్చారు. అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) ఎస్ నీలమణిని కొల్లాపూర్ ఇన్చార్జ్ డిపో మేనేజర్‌గా నియమించారు. హెడ్ ఆఫీస్‌కు చెందిన అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) జీ భరత్ కుమార్‌ను సిరిసిల్ల ఇన్చార్జ్ డిపో మేనేజర్‌గా నియమించారు. హెడ్ ఆఫీస్‌కు చెందిన అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) ఎం మేరీ లావణ్యను నల్లగొండ ఇన్చార్జ్ డిపో మేనేజర్‌గా నియమించారు. పికెట్‌కు చెందిన అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) వై యాకన్నను నారాయణపేట ఇన్చార్జ్ డిపో మేనేజర్‌గా నియమించారు. అసిస్టెంట్ ఇంజినీర్ (మెకానికల్) టీ దయాకర్‌ను హుజూరాబాద్ ఇన్చార్జ్ డిపో మేనేజర్‌గా నియమించారు.