Yadadri | యాదాద్రి జిల్లాలో కీచక టీచర్.. చాక్లెట్ల ఆశచూపి ఆరుగురు బాలికలపై లైంగికదాడి
Yadadri | అన్నెంపున్నెం ఎరుగని ఆరుగురు బాలికలు ఓ టీచర్ చేతిలో బలయ్యారు. వారికి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆ టీచర్ మృగంలా మారాడు. మనవరాళ్ల వయసున్న ఆ బాలికలపై ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.
Yadadri | యాదాద్రి భువనగిరి : అన్నెంపున్నెం ఎరుగని ఆరుగురు బాలికలు ఓ టీచర్ చేతిలో బలయ్యారు. వారికి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆ టీచర్ మృగంలా మారాడు. మనవరాళ్ల వయసున్న ఆ బాలికలపై ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఓ బాలిక ఇటీవల అనారోగ్యానికి గురవడంతో ఆ కీచక టీచర్ అఘాయిత్యం బయటపడింది.
వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో అండెం మాధవరెడ్డి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అయితే తన కోరికలను తీర్చుకునేందుకు మూడో తరగతి చదవుతున్న బాలికలకు చాక్లెట్లు, పైసలు ఆశ చూపి వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. తాకరాని చోట తాకి మరింత నీచానికి దిగజారాడు. ఇటీవలే ఓ బాలిక తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ఆ పాప తనకు జరిగిన అవమానాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. టీచర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తల్లిదండ్రులకు చెబితే, కొట్టి చంపేస్తానని బెదిరించేవాడని ఆ చిన్నారి వాపోయింది.
టీచర్ ఏడాది కాలంగా తమపై చేస్తున్న దారుణాలను బాధిత బాలికలందరూ ఒక్కొక్కటిగా చెప్పారు. ఆగ్రహాంతో ఊగిపోయిన తల్లిదండ్రులు స్కూల్‌కు వెళ్లగా అప్పటికే టీచర్ వెళ్లిపోయాడు. దీంతో తల్లిదండ్రులు పిల్లలను తీసుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. టీచర్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. పోలీసులు టీచర్ మాధవరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

