హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసులో మళ్లీ విచారణ పర్వం మొదలైంది. ఈ కేసులో కీలకంగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ నియామకానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓఎస్డీగా చేసిన రాజశేఖర్‌రెడ్డిని గురువారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లోని సిట్ అధికారులు విచారించారు. ప్రభాకర్‌రావు నియామకానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ గురించి విచారణాధికారి వెంకటగిరి, జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ పలుమార్లు ప్రశ్నించి రాజశేఖర్‌రెడ్డి స్టేట్మెంట్ను రికార్డుచేశారు.