నాంపల్లి కోర్టులు, జూన్ 7(నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సిట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల 14 మంది నిందితులకు హాజరుకానవసరం లేదని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో చార్జ్‌షీట్ దాఖలు చేసే అ వకాశం ఉన్నది. ప్రధాన నిందితులు ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి బెయిల్ పిటిషన్ల తీర్పు ను కోర్టు వాయిదా వేయడంతో చార్జ్‌షీట్ దా ఖలు చేసేందుకు అధికారులు సమాలోచిస్తున్నారు. పూర్తిస్థాయిలో విచారణ ముగిసిన త ర్వాతే చార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించనున్నది.
ప్రధాన నిందితుల విడుదల అనంతరం విడుదలైన 14 మందిని కలిపి తొలి చార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించే ఆలోచనలో సిట్ అధికారులు ఉన్నారు. ఈ కేసులో అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున తొలి చార్జ్‌షీట్ సమర్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రధాన నిందితుడు రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో 409 ఐపీసీ సెక్షన్ ప్రకారం 90 రోజులు పూర్తి అయ్యేంతవరకు బెయిల్ ఇవ్వకూడదన్న నిబంధన నేపథ్యంలో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొన్నది. రమావత్ దత్తు, దానంనేని రవితేజ, లోకిని సతీశ్‌కుమా ర్ తరఫున వేసిన బెయిల్ పిటిషన్లకు కౌంటర్ దాఖలు చేయాలని సిట్ పీపీని ఆదేశించిన ఇన్చార్జి కోర్టు.. విచారణ వాయిదా వేసింది.