Heart Stroke | గుండెపోటును గుర్తించిన ఆపిల్ వాచ్.. ప్రాణాలతో బయటపడ్డ బీజేపీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు
ఆపిల్ వాచ్ చేసిన అలర్ట్‌తో ముందస్తు గుండెపోటు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ.
వేములవాడ, జూన్ 18: ఆపిల్ వాచ్ చేసిన అలర్ట్‌తో ముందస్తు గుండెపోటు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ. కొద్దిరోజులుగా ఆయన ఆపిల్ వాచ్ వాడుతున్నారు. ఇటీవల కాలంలో కొంతదూరం నడిస్తే ఆయాసం, ఛాతిలో మంటలా ఉన్నప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు. గుండెకు సంబంధించిన ఇబ్బంది ఉన్నదని, తక్షణమే వైద్యుల సలహా తీసుకోవాలని ఆపిల్ వాచ్ సోమవారం అలర్ట్ చేసింది.
అప్రమత్తమైన ఆయన వరంగల్ వైద్యులను సంప్రదించారు. పరీక్షించిన డాక్టర్లు గుండెకు సంబంధించిన రెండు రక్తనాళాలు మూసుకుపోయాయని, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని యశోద దవాఖానకు వెళ్లి వైద్య సేవలు పొందారు. విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడే కాదు : హరీశ్ రావు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
CPI | ‘రూ.10 వేల కోట్లతో తెలంగాణ ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి..’
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

