హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎమర్జెన్సీ నంబర్లన్నీ ఒకే గొడుకు కిందకు వచ్చాయి. ఇక మీదట 112 నంబర్‌కు డయల్ చేసి అన్ని రకాల అత్యవసర సేవలను పొందవచ్చు. ఈ నంబర్‌ను అమల్లోకి తెచ్చినట్లు శనివారం ప్రభుత్వం వెల్లడించింది.
పోలీస్ (100), అగ్నిమాపక సేవలు (101), అంబులెన్స్ (108), మహిళల భద్రత (181), బాలల సంరక్షణ (1098), విపత్తు నిర్వహణ (1077) తదితర అత్యవసర సేవలన్నీ 112 నంబర్ ద్వారా లభ్యమవుతాయి. అత్యవసర సమయంలో 112కి డయల్ చేయగానే జీపీఎస్ ద్వారా ట్రాక్‌చేసి నేరుగా సేవలను అందజేస్తారు. ప్యానిక్ బటన్ని గట్టిగా నొకితే ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి 112 నంబర్‌కు నేరుగా కాల్ వెళ్తుంది.