BRS Party | కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాల షెడ్యూల్ విడుదల
BRS Party | కాంగ్రెస్ వెయ్యి రోజుల విఫల పాలనపై బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ భవన్లో ఒక లోగోని ఆవిష్కరించి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఛార్జ్‌షీట్ నమోదు చేస్తూ ప్రజలకు విడుదల చేస్తామన్నారు.
BRS Party | పార్టీ పరంగా సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 8వరకు ఉండే కార్యక్రమాలను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 1 నుండి 8 వరకు కాంగ్రెస్ వెయ్యి రోజుల విఫల పాలనపై బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు.
సెప్టెంబర్ 1న తెలంగాణ భవన్లో ఒక లోగోని ఆవిష్కరించి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఛార్జ్‌షీట్ నమోదు చేస్తూ ప్రజలకు విడుదల చేస్తాం. సెప్టెంబర్ 2న ఆరు గ్యారంటీల వైఫల్యాలపై నియోజకవర్గ కేంద్రాల్లో ఎక్కడికక్కడ ధర్నాలు, బాకీ కార్డులను పంచడం, 420 ఫీట్ల ఫ్లెక్సీని ప్రదర్శన చేస్తమన్నారు. అదేవిధంగా సెప్టెంబర్ 3న వ్యవసాయ విధ్వంసంపై, 22 ఏ కింద నిషేధిత జాబితా కింద పెట్టిన వ్యవసాయ భూములను నీటిపారుదల రంగం, విద్యుత్, యూరియా, గ్రామీణ ప్రాంతాల్లో రైతు బీమా కొరకు రైతు సదస్సులు, హైదరాబాద్, అర్బన్ప్రాంతాల్లో ఎక్కడికక్క ధర్నాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
సెప్టెంబర్ 4న వృద్ధులు, వికలాంగులు, మహిళలతో సదస్సులు, మహిళలకు రూ.2500 ఇస్తామని ఇవ్వకపోవడం, కేసీఆర్ కిట్ బంద్ చేయడం, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌కు మంగళం పాడటం, తులం బంగారం పూర్తిగా ఎగ్గొట్టే కార్యక్రమాలను ఎత్తి చూపుతూ వంటావార్పు ఉంటదని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 5న విద్యార్థులు, యువత ఫీజు రీయింబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ అమలు కోసం నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, సెప్టెంబర్ 6న ఆదిలాబాద్‌లో సీసీఐ, సింగరేణి ప్రాంత 12 నియోజకవర్గాల్లో నిరసన సదస్సులు, తాగునీరు, వీధి దీపాలు, శాంతిభద్రతలు, ట్రాఫిక్, బస్తీ దవాఖాన సాధనకై ఆటోల ర్యాలీ, పల్లెల విధ్వంసం, పడకేసిన పారిశుధ్యానికి నిరసనగా గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు ఉంటాయన్నారు.
అలాగే సెప్టెంబర్ 7న అన్ని జిల్లా , మండల ప్రజావాణి కేంద్రాలలో 420 హామీల అమలుపై వినతిపత్రాల సమర్పణ ఉంటుందన్నారు. సెప్టెంబర్ 8న 7 రోజుల కార్యక్రమాలపై ప్రెస్‌మీట్, అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాలు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నిరసన కార్యక్రమాలకు సంఘీభావం తెలపడం జరుగుతుందని వెల్లడించారు.
సెప్టెంబర్ 1 నుండి 8 వరకు కాంగ్రెస్ వెయ్యి రోజుల విఫల పాలనపై బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు
సెప్టెంబర్ 1న తెలంగాణ భవన్లో ఒక లోగోని ఆవిష్కరించి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఛార్జ్‌షీట్ విడుదల
సెప్టెంబర్ 2న ఆరు గ్యారంటీల వైఫల్యాలపై నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు
సెప్టెంబర్ 3న వ్యవసాయ… pic.twitter.com/T08AWxUYrE
— Telugu Scribe (@TeluguScribe) August 27, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

