కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 4 (నమస్తే తెలంగాణ): ప్రముఖ గాయని కల్పన నిద్రమాత్రలు మింగి ఆత్మహత్మహత్నానికి పాల్పడిన సంఘటన కేపీహెచ్‌బీకాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… గాయని కల్పన నిజాంపేట రోడ్డులోని వర్టెక్స్ ప్రీవీలేజ్ విల్లాస్‌లో నివాసముంటుంది. రెండ్రోజులుగా ఆమె ఇంటి తలుపులు తీయకపోవడంతో పక్క ఫ్లాట్ వారు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కల్పన ఇంటి తలుపులు తీసి లోపటికి వెళ్లగా.. కల్పన అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే పోలీసులు సమీపంలోని వోలిస్టిక్ దవాఖానకు తరలించగా, కల్పన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.