హైదరాబాద్ జూలై 17 (నమస్తే తెలంగాణ): సింగరేణి పీఆర్వో శ్రీరాముల శ్రీకాంత్ తెలంగాణ యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో డాక్టరేట్ అందుకున్నారు. బుధవారం వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పీహెచ్డీ పట్టా ప్రదానం చేశారు.
‘సాంఘిక, రాజకీయ ఉద్యమాల్లో సోషల్ మీడియా పాత్ర, తెలంగాణ ఉద్యమంపై కేస్ స్టడీ’ అనే అంశంపై శ్రీకాంత్ సమర్పించిన థీసిస్‌కు యూనివర్సిటీ డాక్డరేట్ అందజేసింది. శ్రీకాంత్‌ను సింగరేణి సీఎండీ బలరాం, సహోద్యోగులు అభినందించారు.