TGBKS | టీబీజీకేఎస్ పోరుబాట.. బొగ్గు వేలంపై సింగరేణి భగ్గు
బొగ్గు గనుల వేలం, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపి, అధికారులకు వినతిపత్రాలు అందించారు.
- సింగరేణి వ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో నిరసన
TGBKS | నమస్తే నెట్వర్క్, జూలై 1: బొగ్గు గనుల వేలం, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపి, అధికారులకు వినతిపత్రాలు అందించారు. రామగుండం ఒకటో డివిజన్లో ఆర్జీ-1 ఉపాధ్యక్షుడు వడ్డెపల్లి శంకర్ , ఆర్జీ-3 ఏరియా ఓసీపీ-2లో టీబీజీకేఎస్ నాయకులు ఉప్పుల వెంకటేశ్వర్లు, మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఎస్సార్పీ-3 గనిపై మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి , బెల్లంపల్లి సివిల్ డిపార్ట్మెంట్, శాంతిఖని గని ఆవరణలో నల్లబాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
మందమర్రి ఏరియాలోని కాసిపేట-1వ, కాసిపేట-2 ఇైంక్లెన్ గనులపై ఏఐటీయూసీ గేట్ మీటింగ్ నిర్వహించారు. బొగ్గు బ్లాకులను సింగరేణికి ఇవ్వాలని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. రామకృష్ణాపూర్ సీహెచ్‌పీ, బెల్లంపల్లి ఏరియాలోని వర్క్‌షాప్, స్టోర్స్, మందమర్రి ఏరియాలోని కేకే-5గని, ఏరియా వర్క్‌షాప్, బెల్లంపల్లి ఏరియాలోని ఖైర్గూడ ఓసీపీ, గోలేటి సీహెచ్‌పీ, ఏరియా వర్క్‌షాప్, భూపాలపల్లి ఏరియాలోని బొగ్గు గనులపై టీబీజీకేఎస్ నాయకులు, కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపి మేనేజర్లకు వినతిపత్రాలను అందజేశారు.
శ్రావణపల్లి ఓసీపీ గనితోపాటు కల్యాణిఖని 6 బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకే కేటాయించేలా చూడాలని, బొగ్గు బ్లాకుల వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనవద్దని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు సదానందం, భూపాలపల్లి డివిజన్ ఉపాధ్యక్షుడు సమ్మయ్య, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

