చర్ల, ఏప్రిల్ 12: ఇంటి నిర్మాణం కోసం పునాది తవ్వుతుండగా చిన్న పురాతన లోహపు పెట్టె వెలుగుచూసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పాత చర్లలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆంజనేయస్వామి ఆలయం పక్కన ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతున్నాడు. ఈ క్రమంలో చిన్న పురాతన లోహపు పెట్టె బయటపడింది. అందులో పాతకాలపు వెండి నగలు, చిన్న చిన్న పూసలు ఉన్నాయి. గుప్తనిధి పేరుతో తవ్వకాలు జరుపుతున్నారనే ప్రచారం జరగడంతో పోలీసులు ఇంటి నిర్మాణం చేపడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. లోహపు పెట్టెను తాసిల్దార్కు స్వాధీనపరుస్తామని పోలీసులు తెలిపారు.