హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): రాష్టంలోని రైతులకు రూ.76.66 కో ట్ల సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాలను అందజేయనున్నారు. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదివారం నూతన సచివాలయంలోని తన చాంబర్లో ఆసీనులైన వెంటనే ఈ ఫైల్‌పైనే తొలి సంతకం చేశారు. వనపర్తి నియోజకవర్గంలో రూ.38.75 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన చెక్‌డ్యాంల ఫైల్‌పై రెండో సంతకం చేశారు. 18 చెక్‌డ్యాంల ప్రతిపాదనలు పంపించనున్నారు.