Singareni | సింగరేణి ఉద్యోగులకు హెచ్చరిక.. డ్యూటీకి రాకుండా మస్టర్ పడితే వేటే
Singareni | సింగరేణిలో ఇప్పటి వరకు బొగ్గు ఉత్పత్తి పై ప్రత్యేక దృష్టి సారించిన సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్ బలరామ్ ఇప్పుడు కంపెనీలో పని సంస్కృతిని పెంచేందుకు కీలక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కార్యాలయాల్లో ఉద్యోగులు, అధికారుల సమయ పాలనపై ప్రత్యేక దృష్టి సారించారు.
అటెండెన్స్ పడ్డాక ఆఫీసు దాటితే ఉపేక్షించేది లేదు
క్రమశిక్షణ, సమయ పాలన పాటించని ఉద్యోగులు, అధికారులపై కఠిన చర్యలు
భూగర్భ గనుల్లో అధికారులు రోజూ పని ప్రదేశాలు తనిఖీ చేయాలి
కంపెనీ మనుగడ సాగాలంటే పని సంస్కృతి మరింత మెరుగుపడాల్సిందే
సీఎండీ ఎన్ బలరామ్ స్పష్టీకరణ
Singareni | హైదరాబాద్ : సింగరేణిలో ఇప్పటి వరకు బొగ్గు ఉత్పత్తి పై ప్రత్యేక దృష్టి సారించిన సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్ బలరామ్ ఇప్పుడు కంపెనీలో పని సంస్కృతిని పెంచేందుకు కీలక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కార్యాలయాల్లో ఉద్యోగులు, అధికారుల సమయ పాలనపై ప్రత్యేక దృష్టి సారించారు. గనులు, కార్యాలయాల్లో పనిచేస్తున్న కొందరు డ్యూటీలకు రాకున్నా కూడా మస్టర్ పడుతున్నట్లు.. మరి కొందరు మస్టర్ పడి బయటకు వెళ్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా వచ్చిన ఫిర్యాదులపై ఆయన తీవ్రంగా స్పందించారు. అలాగే భూగర్భ గనుల్లో పని ప్రదేశాలను సంబంధిత అధికారులు రోజూ తనిఖీ చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన మంగళవారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.
సింగరేణిలో ఉద్యోగులు, అధికారులంతా కూడా ఇకపై రోజూ తప్పనిసరిగా బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు చేసుకోవాలని.. దీనిపై ఆయా ఏరియా జీఎంలు, విభాగాధిపతులు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే భోజన విరామం పూర్తయిన తర్వాత నిర్ణీత సమయంలో మళ్లీ సీట్లలో కూర్చొని పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. లంచ్ బ్రేక్‌లో చాలా మంది మూడు గంటల పాటు విరామం తీసుకోవడం ద్వారా తమ పనులు/ ఫైళ్లు పెండింగ్‌లో ఉంటున్నాయని పలువురు సీఎండీ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆయన సెక్యూరిటీ విభాగం ద్వారా నివేదికలు తెప్పించుకున్నారు.
గతంలో సింగరేణి ఆస్పత్రులలో, డిస్పెన్సరీలలో వైద్యులు, సిబ్బంది సకాలంలో విధులకు రాకపోతే మెమోలు జారీ చేసిన ఆయన ఇప్పుడు సమయ పాలనను పాటించని వారిపైనా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.
సింగరేణిలోని ప్రతి ఉద్యోగి, అధికారి కచ్చితమైన సమయపాలన పాటించాలని, డ్యూటీలో చేరిన తర్వాత బయటకు వెళ్ళటం గాని, పని చేయకుండా కూర్చోవడం గాని చేయకూడదన్నారు. ఈ విషయంలో ఎంతటి పెద్ద వారైనా, పలుకుబడి ఉన్నవారైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
బొగ్గు ఉత్పత్తి చేస్తున్న కార్మికులు ఎనిమిది గంటలు పనిచేస్తున్నారని.. వారికి సంబంధించిన సంక్షేమం, ఇతరత్రా పనులను నిర్వర్తించే ఉద్యోగులు, అధికారులు మరింత బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులలో కొందరు ఏదో ఒక కారణం చూపి , తాము పనిచేసే కార్యాలయాలను వదిలి వరండాల్లో తిరగడం, బయటికి వెళ్లడం, కబుర్లతో కాలక్షేపం చేస్తే సంబంధిత విభాగాధిపతులపై చర్యలు ఉంటాయన్నారు. దీనిపై నిఘా విభాగం నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
సింగరేణి సంస్థ వ్యాపార విస్తరణలో భాగంగా ఇతర రంగాల్లోకి అడుగులు పెడుతోందని.. కంపెనీ ఉత్పాదకత పెరగాల్సిన అవసరం ఎంతో ఉందని.. ఇందులో ఉద్యోగులు, అధికారులు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించడం అత్యవసరమన్నారు. ముఖ్యంగా ప్రైవేట్ రంగంతో పోటీ పడుతున్న మన సంస్థ మనుగడ సాగాలంటే పని గంటలను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
ఒక క్రమశిక్షణ గల సంస్థగా సింగరేణిని రూపుదిద్దడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎక్కువ మంది కార్మికులు, ఉద్యోగులు, అధికారులు సంస్థ పట్ల అభిమానంతో, వేరెవరో చెప్పే అవసరం లేకుండానే తమకు ఇచ్చిన పనిని అంకిత భావంతో పూర్తి చేస్తున్నారని, డ్యూటీ సమయం మొత్తం పని చేస్తున్నారని, అటువంటి వారిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కానీ కొందరు విధులకు గైర్హాజరవుతూ, మస్టర్ పడికూడ బయటకు వెళ్లడం లేదా డ్యూటీలో ఉండి కూడా పనిచేయకుండా ఉంటున్నారని, ఇలాంటి వారి వల్ల ఇతరులు కూడా పాడైపోయే అవకాశం ఉందనీ హెచ్చరించారు. పని సంస్కృతిని దెబ్బతీస్తే యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంటుందని.. అవసరమైతే క్రమశిక్షణ లేని ఉద్యోగులను విధుల నుంచి తొలగించడానికి వెనకాడబోమన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

