సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా
Collector Venkatrami reddy | సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్కు అందజేశారు. వెంకట్రామిరెడ్డి త్వరలోనే

సిద్దిపేట : సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేశారు. వెంకట్రామిరెడ్డి ఐఏఎస్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద విరమణ చేశారు. తన రాజీనామా లేఖను తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లో సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్కు వెంకట్రామిరెడ్డి అందజేశారు. అనంతరం వెంకట్రామిరెడ్డి రాజీనామాను ప్రభుత్వం ఆమోదించి, ఉత్తర్వులు జారీ చేసింది.
వెంకట్రామిరెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లా ఓదెల. 1991లో గ్రూప్-1 ఆఫీసర్గా ప్రభుత్వ సర్వీసుల్లో వెంకట్రామిరెడ్డి చేరారు. బందర్, చిత్తూరు, తిరుపతిలో ఆర్డీవోగా పని చేశారు. మెదక్ జిల్లాలో డ్వామా పీడీగా సేవలందించారు. హుడా సెక్రటరీ, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్గా, సంగారెడ్డి, సిద్దిపేట కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఏడేండ్లు జేసీగా, కలెక్టర్గా వెంకట్రామిరెడ్డి పని చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

