హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ంలో మొత్తం 11 వేల ఇంజినీరింగ్ సీట్లు భర్తీ కాలేదు. విచిత్రమేంటంటే.. ఇం దులో కన్వీనర్ కోటా సీట్ల కంటే, మేనేజ్మెంట్ కోటా సీట్లే ఎక్కువగా మిగలడం గమనార్హం. కన్వీనర్ కోటాలో 5 వేల సీట్లు మిగిలితే, మేనేజ్మెంట్ కోటాలో 6 వేల సీట్లు మిగిలాయి. ఇక పది ఇంజినీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటాలో ఒక్కరూ చేరలేదు.
కన్వీనర్ కోటాలోనూ 10-15 మంది విద్యార్థులే అడ్మిషన్లు పొందారు. దీంతో ఆయా కాలేజీలను నడపడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాష్ట్రంలో మొత్తం 1.08 లక్షల సీట్లు ఉండగా, కాలేజీల్లోని మొత్తం సీట్లలో 70 శాతం కన్వీనర్, 30 శాతం మేనేజ్మెంట్ కోటాలో భర్తీచేసుకోవచ్చు. 15 శాతం సీట్లను ఎన్నారై కోటాలో భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన సీట్లను ఎప్సెట్ ర్యాంక్, ఇంటర్ మెరిట్ ఆధారంగా నింపుకోవచ్చు.
బీటెక్ మేనేజ్మెంట్ కోటా(బీ క్యాటగిరీ) సీట్ల భర్తీలో పలు కాలేజీలు ఉల్లంఘనలకు పాల్పడ్డట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి గుర్తించింది. ఇష్టారీతిన సీట్లను భర్తీచేసిన తొమ్మిది కాలేజీలపై ఆగ్రహం వ్యక్తంచేసి షో కాజ్ నోటీసులు అందించింది. వాస్తవానికి మేనేజ్మెంట్ కోటా సీట్లను ఉ న్నత విద్యామండలి నోటిఫికేషన్ ఇ చ్చిన తర్వాతే కాలేజీలు భర్తీచేసుకోవా ల్సి ఉంటుంది. కానీ, కొన్ని కాలేజీలు అందుకు విరుద్ధంగా ముందే సీట్లను నింపేసుకోవడంపై కన్నెర్రచేసింది.