కంది: ఒకప్పుడు కరుడుగట్టిన ఖైదీలందరూ ఆ జైలులోనే శిక్షను అనుభవించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ జైలులోనే ఖైదీలకు శిక్షలు విధించే వారు. ఇతర జిల్లాలకు చెందిన వారు కూడా ఇక్కడ శిక్ష అనుభవించిన రోజులు కూడా ఉన్నా యి. అయితే ఈ జైలు పాతదవడంతో పాటు సరిపడా వసతులు లేకపోవడంతో ప్రభుత్వం కొత్త జైలు నిర్మించాలని భావిం చి అందుకు నిధులను విడుదల చేసి కంది శివారులో విశాలమైన జైలును తీర్చిదిద్దారు. ఆ తర్వాత అప్పటి జైలు ఉన్నతాధికారి ఈ జైలు ఇలా అంతరించిపోకుండా ఉండేం దుకు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఫీల్ ద జైల్ కాన్సెఫ్ట్‌తో ఒక రోజు జైలు జీవితం అనుభవించే అవకాశాన్ని రోజుకు రూ.500 కట్టి సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనికి ఎంతో ఆదరణ లభించింది. ఆ తర్వాత ఇదే జైలు ఆవరణలో ఆయుర్వేద వైద్య శాలను ఏర్పాటు చేశారు.
కొన్ని రోజుల తర్వాత సరిపడా సిబ్బంది లేక ఇతర కారణాల వల్ల అది ఆగిపోయింది. ప్రస్తుతం ఈ జైలు సినిమా షూటింగ్‌లకు అడ్డాగా మారింది. ఈ సంవత్సరం విడుదలై మంచి హిట్‌కొట్టిన జాతిరత్నాలు సినిమాకు సంబంధిం చిన కొన్ని సన్నివే శాలు ఇదే జైలులో తీశారు. పైగా ఆ సినిమా దర్శకుడు కూడా ఈ ఊరికి చెందిన వాడే కావడం విషేశం. తాజాగా బిత్తిరి సత్తి నటిస్తున్న ఓ వెబ్ సిరీస్‌కు సంబం ధించిన సన్నివేశాలను కూడా నాలుగు రోజుల పాటు ఇక్కడే చిత్రీకరించారు. వీటితో పాటు ఇతర కొన్ని షార్ట్ మూవీస్ కూడా ఇందులో తీస్తున్నారు. రోజు రోజుకు ఈ సంగా రెడ్డిలోని పాతజైలుకు మంచి ఆదరణ రావడంతో ఇతర దర్శకులు కూడా ఇక్కడ జైలుకు సంబంధించిన సన్నివేశాలు తీసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
జైలుకు ఆదణతో పాటు ఆదాయం…
సంగారెడ్డి పాత జైలులో ప్రస్తుతం ఫీల్ ద జైలుగా మాత్రమే ఉన్నది. అయితే ఈ జైలును కాపాడుకునేందుకు జైలు శాఖ అధికారులు చిన్న చిన్న వెబ్ సిరీస్, ఇతర షార్ట్ మూవీల తో పాటు పెద్ద సినిమాల షూటింగ్‌ల కోసం అనుమతి ఇస్తున్నారు. ఇప్పటికే గత సంవత్సరం రిలీజ్ అయిన పెద్ద హిట్ కొట్టిన జాతిరత్నాలు సినిమాకు సంబంధించిన జైలు సీన్లు అన్ని ఇక్కడే తీశారు. ఈ సనిమా డైరెక్టర్ కూడా సంగారెడ్డి పట్టణానికి చెందిన అనుదీప్ కావడం విషేశం. దీంతో పాత కొన్ని షార్ట్ ఫిల్మ్‌లు కూడా ఇక్కడ జైలు శాఖ అధికారుల అనుమతితో తీస్తున్నారు. తాజాగా బిత్తిరి సత్తి నటిస్తున్న ఓ వెబ్ సిరీస్‌కు సంబంధించిన సన్నివేశాలను నాలుగు రోజుల పాటు ఇక్కడే చిత్రీకరించారు.
సినిమాలో సంగారెడ్డి పాతజైలు సీన్లు బాగా వస్తుండడంతో ఈ జైలుకు బాగా ఆదరణ పెరిగింది. మిగతా దర్శకులు కూడా జైలు సీను సన్నివేశాలు ఇతర సన్నివేశాలు ఇందులో తీయడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ జైలులో షూటింగ్ చేయాలంటే ముందుగా జైలు శాఖ అధికారుల అనుమతి తీసుకున్నాక రోజుకు పెద్ద సినిమాలకైతే రూ.75వేల నుంచి లక్ష వరకు డీడీ ద్వారా హైద్రాబాద్‌లోని రాష్ట్ర జైలు శాఖలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. చిన్న సినిమాలు, ఇతర షార్ట్ మూవీలకు తక్కువ మొత్తంలో డబ్బులు తీసుకుని షుటింగ్‌లకు అనుమతి ఇస్తున్నారు. దీంతో సంగారెడ్డిలోని పాత జైలుకు అటు ఆదాయంతో పాటు సినిమాల్లో కనిపిస్తుండడంతో మంచి ఆదరణ దక్కుతుంది.
ఇప్పటి వరకు 12కు పైగా షూటింగ్‌లు..
సంగారెడ్డి పాత జైలులో ఇప్పటి వరకు 12కుపైగా సినిమాలు, షార్ట్ మూవీలు, వెబ్ సిరీస్, ఇతర అంశాలకు సంబంధించిన షూటింగ్‌లు జరిగాయి. 2017లో మొదటగా ఈ జైలులో షూటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. 2019 ఫిబ్రవరిలో ఓ సినిమాను ఏకంగా 15 రోజుల పాటు ఇక్కడ సన్నివేశాలను చిత్రీకరించారు. అదే సంవత్సరం జూన్, జూలై మాసాల్లో ఇతర సినిమాల షూటింగ్‌లు కూడా జరిగాయి. తాజగా జాతిరత్నాలు సినిమాతో పాటు గత నెల బిత్తిరి సత్తి ప్రధాన పాత్రలో ఆహాలో రాబోతున్న తోడేళ్లు వెబ్ సిరీస్ ను నాలుగు రోజుల పాటు చిత్రీకరించారు. గత నెలలో అన్నపూర్ణ బ్యానర్లో హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న ఓ వెబ్ సినిమా షూటింగ్ కూడా ఇక్కడే తీశారు. అయితే ఒక్క రోజు కు రూ.75 వేల చొప్పున జైలు శాఖ ఉన్నతాధికారులు వారి ద్వారా డీడీ రూపంలో తీసుకుంటున్నారు. ఈ లెక్కన ఇప్పటిదాకా జరిగిన 12కుపైగా చిత్రీకరణ ద్వారా జైలు శాఖకు లక్షల్లో ఆదాయం వచ్చింది.
అలాగే ఫీల్ ది జైలు కాన్సెప్ట్ ద్వారా ఒక రోజు ఒక మినిషి ఉండడానికి అతడి నుంచి రూ.500 తీసుకుంటున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈ పాత జైలులో పాత గోడలు, పాత రూపంలో ఉన్న కట్టడం ఉండడాన్ని అలాగే ఉంచడంతో దర్శకులు ఇక్కడ జైలు సన్నివేశాలు తీయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతు న్నారు. రాష్ట్ర జైలు శాఖ డీజీ రాజీవ్‌త్రివేది, డీఐజీ మురళీబాబుల సహకారంతో ఇక్కడ షూటింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. దీంతో సంగారెడ్డి పాతజైలు ఇప్పుడు ఇరు తెలుగు రాష్ర్టాల ప్రజలకు సుపరిచితం అవుతుండడంతో ఇక్కడి ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జైలు అధికారులు తీసుకుంటున్న సరికొత్త నిర్ణయాలను వారు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
షూటింగ్‌లతో జైలు శాఖకు ఆదాయం: వీ.శ్రీను నాయక్, జిల్లా సబ్ జైలు అధికారి, ఉమ్మడి మెదక్ జిల్లా. సంగారెడ్డి పాత జైలును హెరిటేజ్ జైలు మ్యూజియంగా తీర్చిదిద్దడం గతంలోనే జరిగింది. ఇంతకు ముందు ప్రపంచలో ఎక్కడా లేని విధంగా ఈ జైలులో ఒక రోజు సామాన్య వ్యక్తి జైలు జీవితం అనుభూతిని పొందేలా ఫీల్ ది జైలును ఉన్నతాధికారులు తీసుకొచ్చారు.
పాత జైలు పూర్తిగా అంతరించిపోకుండా జైలు శాఖ డీజీ, డీఐజీల కొత్త ఆలోచనలతో ప్రస్తుతం సినిమా ఇతర చిన్న చిత్రాలకు షూటింగ్‌కు అనుమతి ఇస్తున్నాం. 2017 నుంచి ఇప్పటి వరకు దాదాపు 12కు పైగా సినిమా లు, వెబ్ సిరీస్ ఇతర షూటింగ్‌లు ఇక్క డ జరిగాయి. ఒక్క రోజుకు ఇక్కడ షూటింగ్ చేయడానికి రూ.75వేలు చార్జీలు తీసుకోవడం జరుగుతుంది. రోజు రోజుకు ఇక్కడ షూటింగ్ సందడి ఎక్కువగా పెరుగుతుండడంతో జైళ్ల శాఖకు మంచి ఆదాయం వస్తున్నది.