హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): ఈనెల 30న ఉద్యోగ విరమణ చేయనున్న సీఎస్ శాంతికుమారిని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్ఆర్డీ) వైస్‌చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దీంతోపాటు ఎంసీహెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్‌గా కూడా ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ప్రకటించింది. వేర్వేరు జీవోలను సోమవారం విడుదల చేసింది.
హామీల్లో కొన్నింటినే అమలు చేశాం ; అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే రద్దు చేస్తాం
అశ్వారావుపేట, ఏప్రిల్ 28 : అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే రద్దు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇందిరమ్మ కమిటీలు కూడా అర్హులను గుర్తించి ఇండ్లు మంజూరు చేయాలని సూచించారు. సోమవారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో పర్యటించారు. కొన్ని హామీలను మాత్రమే అమలు చేస్తున్నామని, మిగతా వాటిని ఎందుకు అమలు చేయలేకపోతున్నామన్నది ప్రజలకు చెప్పలేమంటూ వ్యాఖ్యానించారు. ‘గూడులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయరా..? అని గుర్రాలచెరువు గ్రామానికి చెందిన మహిళలు మంత్రి పర్యటనలో అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు.