శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, సబితారెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 17 : రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా ఇటీవల ఎన్నికైన శంభీపూర్ రాజు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలోని తన చాంబర్లో ప్రొటెం చైర్మన్ అమీనుల్ హసన్ జాఫ్రీ ఆయనతో ప్రమాణం చేయించారు. శంభీపూర్ రాజును మంత్రులు కే తారకరామారావు, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ప్రభుత్వ విప్‌లు అరికపూడి గాంధీ, ఎమ్మెస్ ప్రభాకర్, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు టీ భానుప్రసాద్, నవీన్‌కుమార్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వీ నరసింహాచార్యులు, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు అభినందించారు.