హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా షబ్బీర్ అలీ (Mohammed Shabbir Ali ) శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలోని కార్యాలయంలో ప్రార్థనల అనంతరం పదవీ బాధ్యతలు చేపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ సలహాదారుగా (State Government Advisor) పదవీ బాధ్యతలు స్వీకరించిన షబ్బీర్‌ను రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జూపల్లి కృష్ణ రావు, బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణ మోహన్ రావు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
షబ్బీర్‌ను కలిసిన వారిలో న్యూ ఢిల్లీలో ప్రభుత్వ సలహాదారు మల్లు రవి, జీఏడీ కార్యదర్శి రఘునందన్ రావు, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి నవీన్ నికోలస్, పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.