Wanaparthy | ఆత్మకూరు, జనవరి 25 : చిన్నారిపై లైంగికదాడి జరిగిన ఘటన వనపర్తి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ కేఎస్ రత్నం, ఎస్సై నరేందర్ కథనం మేరకు.. ఈనెల 22న ఆత్మకూరు మండలంలో ఐదేండ్ల చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని చెప్పి అదే వాడకు చెందిన 17 ఏండ్ల బాలుడు ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.
రెండ్రోజుల తర్వాత జరిగిన విషయాన్ని ఆ చిన్నారి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ ఆనందరెడ్డి నేతృత్వంలో విచారణ చేపట్టారు. పోలీసుల సంరక్షణలో చిన్నారికి వైద్యపరీక్షలు నిర్వహించి గురువారం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని జువైనల్ హోమ్‌కు తరలించారు.