Hyderabad | వెంగళరావునగర్, నవంబర్ 5: ఇంటి వద్ద బట్టలు ఉతకాలని చెప్పి ఒక మహిళను కూలికి తీసుకెళ్లిన ముగ్గురు కామాంధులు ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. నోట్లో గుడ్డలు కుక్కి, బెల్ట్‌తో కొట్టి ఈ దారుణానికి పాల్పడ్డారు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం.. కొండాపూర్‌కు చెందిన మహిళ (50) భవన నిర్మాణ కూలీగా పననిచేస్తున్నది. సోమవారం కూలి పనులు ముగించుకొని సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి బయలుదేరింది. హైటెక్‌సిటీ బస్‌స్టాప్ జంక్షన్ వద్ద బస్ కోసం వేచి చూస్తుండగా.. అంతలోనే ముగ్గురు వ్యక్తులు ఆటోలో వచ్చి రహ్మత్‌నగర్ డివిజన్ పరిధిలోని ఓంనగర్‌లో ఉన్న తమ ఇంట్లో బట్టలు ఉతకాలని, రూ.500 ఇస్తామని చెప్పి తీసుకెళ్లారు. బట్టలు ఇంట్లో ఉన్నాయని చెప్పిన నిందితులు లోనికి తీసుకెళ్లి గట్టిగా పట్టుకున్నారు.
లైంగికదాడికి యత్నిస్తుండగా వారి నుంచి తప్పించుకునేందుకు ఆమె ప్రయత్నించింది. ఆమెను బెల్టుతో తీవ్రంగా కొట్టారు. నోటిలో గుడ్డలు కుక్కి, దుస్తులు చింపేశారు. మద్యం తాగుతూ లైంగికదాడికి పాల్పడ్డారు. చివరికి బాధిత మహిళ బిగ్గరగా కేకలు వేయడంతో పొరుగింటిలో ఉండే ఒక మహిళ తలుపు తట్టి లోపలికి వచ్చి కాపాడేందుకు యత్నిస్తుండగా.. ఆ కమాంధులు బాధితురాలి గొంతు నులిమి చంపేందుకు యత్నించారు. అతికష్టంతో వారి బారి నుంచి విడిపించుకుని నగ్నంగా బాధిత మహిళ బయటకు రాగా.. పక్కింటి మహిళ నైటీ ఇచ్చింది. అక్కడినుంచి కామాంధులు పారిపోయారు. బాధిత మహిళ రాత్రి 11.30 గంటలకు మధురానగర్ పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల అదుపులో నిందితుడు?
లైంగిక దాడికి పాల్పడ్డ ముగ్గురు నిందితులు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన చందు చౌహాన్(25), ఎండీ రఫీక్‌ఖాన్, చోటుగా పోలీసులు గుర్తించారు. వీరు పెయింటింగ్ పనులు చేస్తారని, నెల క్రితమే వచ్చి ఇక్కడ అద్దెకు ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు చందు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. మంగళవారం ఉదయం వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్, పంజాగుట్ట ఏసీపీ మోహన్‌కుమార్ ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని మధురానగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.