కోతులకు కు.ని. ఆపరేషన్లు

- అందుకు మరిన్ని ఆపరేషన్ థియేటర్లు
- ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష
- పంటల రక్షణకు పలు నిర్ణయాలు
హైదరాబాద్, డిసెంబర్1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పంటలను నాశనం చేస్తున కోతులకు విరివిగా సంతాన నిరోధక ఆపరేషన్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. అలాగే కోతులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కోతుల బెడద నివారణకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసి సూచనలు ఇచ్చేందుకు అటవీ, వెటర్నరీ, వ్యవసాయ నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కోతులు, అడవి పందుల బెడద నివారణకు చేపట్టాల్సిన చర్యలపై బుధవారం ఆయన బీఆర్కే భవన్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోతులు, అడవి పందుల బెడద నివారణకు చేపట్టాల్సిన చర్యలు సూచించాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కోతుల బెడద నివారణకు వివిధ రాష్ట్రాల్లో చేపడుతున్న చర్యలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకొన్నారు. సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, పీసీసీఎఫ్ శోభ, వ్యవసాయ వర్సిటీ వీసీ డాక్టర్ ప్రవీణ్‌రావు, వెటర్నరీ వర్శిటీ వీసీ డాక్టర్ రవీందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, పురపాలకశాఖ డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ, పలువురు ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
నిర్ణయాలు ఇవీ..
- కోతుల బెడద నివారణ సూచనలకు అటవీ, వెటర్నరీ, వ్యవసాయశాఖల్లోని నిపుణులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు.
- ఈ కమిటీ వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ పద్ధతులపై అధ్యయనం చేసి వారంలోగా ప్రతిపాదనలు సమర్పించాలి.
- కోతుల సంఖ్యను నియంత్రించేందుకు మరిన్ని సంతాన నిరోధక ఆపరేషన్ థియేటర్ల ఏర్పాటు.
- కోతుల బారి నుంచి పంటలను కాపాడేందుకు సంప్రదాయక విధానాలపై ప్రజలను చైతన్యపరచాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

