హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ప్రముఖ శీతల పానీయాల తయారీ సంస్థ హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్(హెచ్‌సీసీబీ)తో తెలంగాణ ప్రభుత్వ గ్రామీణాభివృద్ధిశాఖకు చెందిన గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం(ఎస్ఈఆర్పీ-సెర్ప్) ఒప్పందం కుదుర్చుకున్నది. సెర్ప్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి(సీఈవో) దివ్యదేవరాజన్, హెచ్‌సీసీబీ సీఎస్ఆర్ హెడ్ శ్వేత పునీతతోపాటు ఉన్నతాధికారుల సమక్షం లో మంగళవారం ఈ ఎంవోయూ కుదిరింది. 100మహిళా శక్తి క్యాంటీన్లతో అనుబంధం ఉన్న 1000కిపైగా వ్యాపారులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నది.