సీఎం కేసీఆర్ సమక్షంలో నేడు టీఆర్ఎస్లోకి పెద్దిరెడ్డి
పెద్దిరెడ్డి | బీజేపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో

హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ)/హుజూరాబాద్ టౌన్: బీజేపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరనున్నారు. తెలంగాణభవన్‌లో సాయంత్రం 4 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఆయన అనుచరులు, కార్యకర్తలు భారీగా తరలిరానున్నారు. గురువారం ఆయన హుజూరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించారు. దళితబంధు పథకాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఉప ఎన్నికలో ప్రజలు బావోద్వేగాలకు గురికావొద్దని, విజ్ఞతతో ఓటేయాలని కోరారు. నిరుపేద దళితుల, దేవాలయ భూములను ఆక్రమించి, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్‌ను బీజేపీలో చేర్చుకోవటాన్ని నిరసిస్తూ, ఆయన ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

