హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ప్రము ఖ పాత్రికేయుడు తెలిదేవర భానుమూర్తి (73) కన్నుమూశారు. కొద్దిరోజులుగా పరిస్థితి విషమించిందని, బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. తెలంగాణ మాండళిక శోభను అక్షరాల్లో నింపి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన ప్రత్యేక పాత్ర పోషించారు. ఆయన మరణం సాహిత్య, మీడియా వర్గాల్లో విషాదం నింపింది. ఆయన మాటలో, నవ్వులో, నడవడికలో తెలంగాణ స్ఫూర్తి కనిపించేదని సహచరులు చెప్తుంటారు. 1953 జనవరి 16న భువనగిరిలో జన్మించిన భానుమూర్తి యాదగిరిగుట్ట, ఆర్మూర్లో చదువుకొని, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తిచేశారు. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.