బీఆర్ఎస్లోకి నందికంటి శ్రీధర్
బీఆర్ఎస్లోనే బీసీలకు న్యాయం జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీలో వెనుకబడిన వర్గాలకు స్థానం లేదని జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ పేర్కొన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
- కాంగ్రెస్‌లో బీసీలకు స్థానం లేదు
- ఎన్నేండ్లు కష్టపడినా చివరకు మొండిచెయ్యే: నందికంటి
- శ్రీధర్‌కు బీఆర్ఎస్లో సముచిత గౌరవం కల్పిస్తాం: కేటీఆర్
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్లోనే బీసీలకు న్యాయం జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీలో వెనుకబడిన వర్గాలకు స్థానం లేదని జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ పేర్కొన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మేడ్చల్ డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన శ్రీధర్ తన అనుచరులతో కలిసి బుధవారం సాయంత్రం బీఆర్ఎస్లో చేరారు. శ్రీధర్‌తోపాటు కాంగ్రెస్‌ను వీడిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు మంత్రి కేటీఆర్, విప్ శంభీపూర్ రాజు, ఎమ్మెల్సీన నవీన్‌కుమార్ గులాబీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున దాదాపు టికెట్ ఖరారై, చివరి నిమిషంలో తీరని అన్యాయం జరిగిందనే ఆవేదనతో నందికంటి బీఆర్ఎస్లో చేరాలనే పెద్ద నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. జీవితంలో మొదటిసారిగా ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వస్తున్న శ్రీధర్‌ను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.
గత పదేండ్లుగా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ను ఎదుర్కొనే సరైన ఎజెండా లేకుండా పోయిందని విమర్శించారు. గత పదేండ్లలో హైదరాబాద్ నగరం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చిందో, ఈ ఏవిధంగా అభివృద్ధి అయిందో గుర్తించాలని అన్నారు. నందికంటి శ్రీధర్‌కు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగిందని, బీఆర్ఎస్లో ఆయనకు తగిన గౌరవం కల్పిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్న శ్రీధర్.. కాంగ్రెస్‌లో ఎంత నిబద్దతతో పని చేశారో తాను అంతే నిబద్దతతో బీఆర్ఎస్లో కూడా పని చేస్తానని చెప్పిన మాటలు ఎంతో నచ్చాయని అన్నారు. శ్రీధర్‌తోపాటు ఆయన అనుచరులను కాపాడుకుంటామని, వారిని కూడా సరైన విధంగా గౌరవించుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. బీఆర్ఎస్కు ఉన్న హైకమాండ్, నాయకులు కేసీఆర్ ఒక్కరు మాత్రమేనని, ఆయన ఆదేశాలు, సూచనల మేరకు మాత్రమే పార్టీ పని చేస్తుందన్నారు. తమకు ఢిల్లీలో బాసులు లేరని చెప్పారు.

Nadikanti2
బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడమే మా ఆశయం: నందికంటి
కాంగ్రెస్ పార్టీలో ఎంతో కష్టపడి పనిచేశామని, కానీ ఆ పార్టీలో బీసీలకు మనుగడ ఉండదనే వాస్తవం అర్థమైందని నందికంటి శ్రీధర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు న్యాయం జరగదని, ప్రభుత్వపరంగాగానీ, అన్నిరకాలుగాగానీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే బీసీలకు న్యాయం జరుగుతుందని, అందుకే బీఆర్ఎస్ పార్టీలో చేరామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చమట, రక్తం ధారపోసినా అక్కడ స్థానం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద వృక్షంలాంటి కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం సంతోషంగా ఉందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో మల్కాజిగిరిలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా గెలిపించటమే తమ ఆశయమని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

