సుల్తాన్‌బజార్, జనవరి 17: ఉద్యోగ విరమణ ప్రయోజనాల ఫైల్‌ను ప్రాసెస్ చేసేందుకు లంచం తీసుకుంటూ ఈఎన్టీ ప్రభుత్వ దవాఖాన సీనియర్ అసిస్టెంట్ ఆర్ సంతోష్ తివారీ ఏసీబీకి చిక్కాడు. ఓ ఉద్యోగికి సంబంధించిన విరమణ ఫైల్‌ను ప్రాసెస్ చేసేందుకు రూ. 20 వేలు లంచం అడిగాడు. ఈ క్రమంలో ఇప్పటికే రూ. 17 వేలు తీసుకున్నాడు. మరో రూ. 3వేల కోసం పట్టుబట్టడంతో రిటైర్డ్ ఉద్యోగి ఏసీబీని ఆశ్రయించాడు. శుక్రవారం ఏవో సంతోష్ తివారీకి రూ. 3 వేలు లంచం ఇస్తుండగా, ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని ఏసీబీ న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు.
బీసీ గురుకులాల సొసైటీతో ప్యూర్ ఎంవోయూ
హైదరాబాద్, జనవరి17 (నమస్తే తెలంగాణ): వెనుకబడిన తరగుతుల విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలను అందించడంలో భాగంగా మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), ప్యూర్ (పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్) మధ్య ఎంవోయూ కుదిరింది. శుక్రవారం ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ ప్రధాన కార్యాలయంలో కార్యదర్శి బీ సైదులు, ప్యూర్ సీఈవో డాక్టర్ శైలా తల్లూరి సంతకాలు చేశారు. విద్యార్థుల సాంకేతిక నైపుణ్యతను, నాయకత్వ లక్షణాలను, సామాజిక సేవలను, నెలసరి స్వచ్ఛతను ప్రోత్సహించే లక్ష్యాలతో ఈ అవగాహన ఒప్పందం కుదిరినట్టు వారు తెలిపారు. పర్యావరణ సుస్థిరత, లింగ సమానత్వం, పౌర బాధ్యత వంటి కీలక సామాజిక సమస్యలపై వర్క్‌షాప్‌లు నిర్వహిస్తామని పేర్కొన్నారు.