న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. శుక్రవారం జరిగిన పురుషుల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో రుద్రాంక్ష్ పాటిల్ పసిడి పతకంతో మెరిశాడు. మాజీ ప్రపంచ చాంపియన్ అయిన రుద్రాంక్ష్ 251.9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం సొంతం చేసుకోగా, భారత్‌కే చెందిన అర్జున్ బబుత (250.7) రజతం సొంతం చేసుకున్నాడు.
అదే దూకుడు కొనసాగిస్తూ రుద్రాంక్ష్ (632.1), అర్జున్ (628.0), విశాల్‌సింగ్(624.6)తో కూడిన భారత త్రయం 1884.7 స్కోరుతో మరో పసిడి పతకాన్ని ఖాతాలో వేసుకోగా, కజకిస్థాన్(1879.4), జపాన్(1877.2) రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాయి.