Veterinary Courses | వ్యవసాయ యూనివర్సిటీ, మే 29 : పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్( బీవీఎస్సీ) డిగ్రీ కోర్సుల్లో సెల్స్ ఫైనాన్స్ (ఎన్ఆర్ఐ) కోటా సీట్లను 15కు పెంచాలని పాలకమండలి నిర్ణయించింది. రాజేంద్రనగర్, కోరుట్లలో ఒక్కో దానిలో 5 సీట్ల చొప్పున 10 ఉన్నాయనీ, కొత్తగా వరంగల్ జిల్లా మాములూరు కళాశాలకు జాతీయ వైద్య మండలి విసిఐ గుర్తింపు లభించినందున దానిలోను ఐదు సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ కింద భర్తీ చేసేందుకు పాలకమండలి అనుమతి ఇచ్చిందని వీసీ జ్ఞాన ప్రకాశ్ ఒక ప్రకటనలో తెలిపారు.